ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రి లో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాసిన ఈ లేఖలో వివిధ అంశాలగురించి ప్రస్తావించారు. రాజమండ్రి లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చెయ్యాలన్న ఆకాంక్ష మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి దేనని, కర్నూలు తో పాటు రాజమండ్రి లో కూడా హైకోర్టు బెంచ్ పెట్టి రాజశేఖర్ రెడ్డి కోరిక తీర్చాలని కోరారు. 14 ఏళ్ల క్రితం జగన్ నాన్న గారి మాటలను ఆలోచన చేసే విదంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఈ లేఖ రాసానని తెలిపారు ఉండవెల్లి. రాజమండ్రి లో ఉన్న ట్రన్స్ పోర్ట్ అంతా బాగుంటుంది, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, గోదావరి అన్ని విధాలా రాజమండ్రి లో హైకోర్టు బెంచ్ పెట్టడానికి మంచి వాతావరమన్నారు. రాజమండ్రి లో ఇసుక దొరకడం లేదు, కొవ్వూరు నుండి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని లేఖలో పేర్కొన్నారు, పోలవరాన్ని శరవేగంగా పూర్తి చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.