ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ ఎమ్మెల్యే
తుళ్లూరులో రైతులను బెదిరించి 52 వేల ఎకరాలను లాక్కున్నారు. పట్టా భూములకు ఓ రేటు.. అసైన్డ్ భూములకు మరో రేటు నిర్ణయించారు. సీఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కాదు.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ.
ఖరీదైన స్థలాల్లో రాజధానిని పెట్టారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఉండాలి. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం టెంట్లు వేశారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న తర్వాత కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
భూములు లేని పేదవారిని ఆదుకునేందుకు సీఆర్డీఏ ద్వారా మా ప్రభుత్వం రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని భావిస్తే.. చంద్రబాబు కోర్టుకు వెళ్లి మోకాలు అడ్డుపెట్టారు.
సీఆర్డీఏ మొత్తం చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రైతులతో కలిసి మా ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు.