మహారాష్ట్ర ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఉదయం 4.40 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జి కూలిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చిందని స్థానికులు తెలిపారు.
గాయపడ్డ వారిని శాంతాక్రజ్ లోని వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి తరలించగా… ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు.