ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన 400కోట్ల లెక్కచూపని ఆదాయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర విచారణ సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 24న దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో 20చోట్ల అధికారులు దాడులు జరపగా… ఈ 400కోట్లు అక్రమంగా గుర్తించారు.
ఇదే అంశాన్ని కంపెనీ పేరును వెల్లడించకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సంస్థ 400కోట్ల అక్రమ సంపాదనను గుర్తించినట్లు వెల్లడించింది. లెక్కచూపని సొమ్మని తేల్చేసింది.
అయితే, రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… ఈ సొమ్మంతా ఖైరతాబాద్ కు చెందిన మన్నె గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా అని, సత్యనారాయణ రెడ్డి చైర్మన్ అన్న ప్రచారం జరుగుతోంది. సత్యనారాయణ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఈ దాడుల సందర్భంగా 1.66కోట్ల లిక్విడ్ క్యాష్ కూడా దొరికినట్లు ప్రచారం సాగుతుంది. ఈ నాలుగు వందల కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది.