పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూ లో ఎంపిక అయినా ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగులు సెల్ టవర్ ఎక్కిన సంఘటన విజయవాడ కృష్ణలంక వల్లూరివారి వీధిలో చోటుచేసుకుంది. అర్హత ఉన్న తమకు ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెంటనే సరిదిద్దుకోకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. సెల్ టవర్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మోసపూరితంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. అధికారులను కలిసిన, గవర్నర్ కి కలిసిన మాకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని మాకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు.