హైదరాబాద్‌లో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. నాలుగేళ్లు క్రితం పరీక్షలు రాసినా.. ఫలితాలు విడుదల చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టులు భర్తీ చేయడమో లేదా.. తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వడమో చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు చెందిన దాదాపు 600 మంది అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఫలితాలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను పోషించే దారిలేక… ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.