ఎల్చల దత్తాత్రేయ
ఓయు-జేఎసి-అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ తక్షణం భర్తీ చేయాలని నిరుద్యోగులతో ట్విట్టర్ పోరాటానికి శ్రీకారం చుట్టాము. ఉద్యోగాలను భర్తీ చేయాలంటే మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ముఖ్యంగా ట్విట్టర్ పిట్ట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ ఉద్యోగాల భర్తీ కోరుతూ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు సార్లు ట్వీట్ చేయాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిద్-19 వల్ల ప్రత్యక్ష ఉద్యమాలు చేయలేం కాబట్టి సాంకేతిక ఉద్యమానికి నాంది పలికాం. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల నినాదాలతో భర్తీ కోరుతూ పెట్టే మెసేజీలట్విట్టర్లతో కేటీఆర్ దిగివచ్చి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మన పోరాటం కొనసాగించాలి.