కోటూరి మానవతారాయ్…విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్
ఏప్రిల్ 24 న జరగాల్సిన నిరుద్యోగ జేఏసీ పాదయాత్రను ఏప్రిల్ 30న మార్నింగ్ వాక్ గా పేరు మార్చటం జరిగింది. ఉదయం 7 30 గంటలకి వాక్ ప్రారంభం అవుతోంది. ధర్నా చౌక్, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ జరుగుతుంది.
నిరుద్యోగులంతా భారీస్థాయిలో హాజరై మార్నింగ్ వాక్ ను జయప్రదం చేసి.. ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆవేదన తెలిసేలా నినదించాలి. ఉద్యోగ నోటిఫికేషన్ లో అన్ని రకాల పోస్ట్ లకు మయో పరిమితిని పెంచాలి.
ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఇతర యూనిఫాం ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 5 సంవత్సరాలకు పెంచాలి. గ్రూప్1 డీఎస్పీ ఎత్తును 165 సెంటీమీటర్లకి కుదించాలి.
డీఎస్పీ గరిష్ఠ వయోపరిమితిని 28 ఏళ్ళ నుండి 32ఏళ్ళకి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలి. మాతృభాష తెలుగును అర్హత పరీక్షగ పెట్టాలి.