రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులన్ని చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. ఈ మేరకు టికాయత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
రైతు ఉద్యమ నిరసనల నుంచి తప్పుకోవాలని రాకేశ్ టికాయత్‌ను గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరసనల నుంచి తప్పుకోకపోతే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాంబులు పెట్టి చంపేస్తామంటూ హెచ్చరించారని తెలిపారు.
దీనిపై బౌరా కలాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేశ్ టికాయత్ సోదరుడు, బీకేయూ చీఫ్ నరేష్ టికాయత్ కుమారుడు గౌరవ్ టికాయత్ ఫిర్యాదు చేశారని ఎస్ఐ అక్షయ్ శర్మ వెల్లడించారు. దుండుగున్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. `
కేంద్రం తీసుకు వచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బీకేయూ నేత రాకేష్ టికాయత్ పోరాటం చేశారు. లఖీంపూర్ ప్రాంతంలో అల్లర్ల కేసులో కేంద్ర మంత్రి కుమారుడికి శిక్ష విధించాలంటూ ఆయన రైతులతో కలిసి పోరాటానికి కూడా దిగారు. తాజాగా ఆయన రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.