దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం లేదని ఎంఐఎం చీఫ్, లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. న్యాయ కమిషన్ గతంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.

గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం హిందు పురుషుడు రెండో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. 30 ఏళ్లలోపు దంపతులకు మగ బిడ్డ పుట్టకపోతే హిందు పురుషుడికి రెండో వివాహం చేసుకునే హక్కు ఉందన్నారు.
గోవాలో బీజేపీ ప్రభుత్వమే ఉందన్నారు. కానీ ఈ నిబందనపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 47 ప్రకారం మద్య నిషేధం విధించాలి కానీ అమలు జరుగుతోందా అని అడిగారు.