ఉత్తరాఖండ్ లో త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఉదాహరణగా తీసుకుని తమను అనుసరించాలని కోరారు.
ఉమ్మడి పౌరస్మృతి అనేది తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. అందువల్ల ఆ దిశలో తమ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. త్వరలో ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
ఉమ్మడి పౌరస్మృతి చట్టంలో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాల్లో మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం ఈ చట్టం గోవాలో మాత్రమే అమలులో ఉంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసుకురావాలని పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం, దాని సైద్దాంతిక గురువు ఆర్ఎస్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టానికి సంబంధిచి డ్రాఫ్ట్ ప్రతిని రూపొందించినట్టు మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది.