కాంగ్రెస్ నేత శశిథరూర్ కు ఇంగ్లీష్ భాషపై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుటికప్పుడు కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలను ట్వీట్లలో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పైగా ఆ పదాలను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో అందరికి వివరిస్తుంటారు.
అలాంటి శశిథరూర్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పాఠాలు చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి రాందాస్ ముఖ కవలికలకు సంబంధించిన ఫోటోను థరూర్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇస్తున్న వివరణలు వారి ట్రెజర్ బెంచ్ లు సైతం నమ్మలేకపోతున్నాయంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో కొన్ని అక్షర దోషాలు దొర్లాయి.
దీంతో ట్వీట్ పై స్పందించిన అథవాలే… ‘ డియర్ శశిథరూర్ జీ. అనవసర వాదనలు, ప్రకటనలు చేసే సమయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. మీరు కూడా అలానే చేశారు. అది బైడ్జెట్ కాదు బడ్జెట్.. రిలై కాదు రిప్లై. పర్వాలేదు మేము అర్థం చేసుకున్నాము ” అంటూ పేర్కొన్నారు.
ఈ సూచనలకు శశిథరూర్ స్పందించారు. ‘ అజాగ్రత్తగా వాక్యాలు టైప్ చేయడం చెత్త ఇంగ్లీష్ మాట్లాడటం కన్నా చాలా పెద్ద పాపం. మీరు టీచర్ రోల్ ఉండగా.. మీ వద్ద ట్యూషన్ తీసుకున్న వారు జెఎన్‌యులో ఉన్నారు. ఈ వ్యాఖ్యలను నూతనంగా జేఎన్ యూ వీసీగా నియమితురాలైన శాంతిశ్రీ వర్సిటీ విద్యార్థుల, ప్రొఫెసర్లకు రాసిన లేఖలో తప్పులు దొర్లడాన్ని ఉద్దేశించి చేశారు.