సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ప్లే స్టోర్ యాప్‌లో ఉన్న మాల్‌వేర్ యాప్‌లను ఎప్పటికప్పుడూ తొలగిస్తూనే వస్తోంది. అయినప్పటికీ ఇంకా పలు మాల్‌వేర్ యాప్ లు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మరో 17 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ ఏడాది జూలై నెలలో 11 మాల్‌వేర్ యాప్‌లను తొలగించగా.. గత రెండు, మూడు రోజుల కిందటే మరో 6 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీంతో మొత్తం 17 యాప్‌లను ఇటీవలి కాలంలో గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
* com.imagecompress.android
* com.relax.relaxation.androidsms
* com.file.recovefiles
* com.training.memorygame
* Push Message- Texting & SMS
* Fingertip GameBox
* com.contact.withme.texts
* com.cheery.message.sendsms (two different instances)
* com.LPlocker.lockapps
* Safety AppLock
* Emoji Wallpaper
* com.hmvoice.friendsms
* com.peason.lovinglovemessage
* com.remindme.alram
* Convenient Scanner 2
* Separate Doc Scanner
పైన తెలిపిన యాప్‌లను మీరు మీ ఫోన్లలో ఇప్పటికే వాడుతున్నట్లయితే వెంటనే వాటిని తీసేయండి. లేదంటే అవి జోకర్ అనే మాల్‌వేర్‌ను మీ ఫోన్‌లో వ్యాపింపజేస్తాయి. దీంతో మీ ఫోన్‌లో ఉన్న సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఫోన్ పనిచేయకుండా పోయేందుకు కూడా అవకాశం ఉంటుంది.
కాగా ఈ జోకర్ మాల్‌వేర్ యాప్‌లను నిజానికి 2017 లోనే చాలా వరకు గూగుల్ తొలగించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ జోకర్ మాల్‌వేర్ యాప్‌లు ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఈ యాప్‌లు ఇప్పటికే 2 లక్షల వరకు డౌన్‌లోడ్స్ పూర్తయ్యాయి. అందువల్ల వీటిని చాలా మందే ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ యాప్‌లను మీరు ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంటనే ఫోన్ల నుంచి తీసేయడం మంచిది.