అనేకానేక సవాళ్ల మధ్య.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుంచనున్నారు. లాక్‌డౌన్‌తో అస్తవ్యవస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఆక్సిజన్ అందించనున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కరోనాతో చిన్నాభిన్నమైన సామాన్యుడికి రిలీఫ్ ఇచ్చేందుకు ఎలాంటి టీకా వేస్తారనేది కూడా ఈ బడ్జెట్‌లో ప్రధానాంశంగా మారింది. దాదాపుగా 30 అంశాలపై కేంద్రం ఈ సారి బడ్జెట్‌లో ఫోకస్ చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్య, వైద్యం, మౌళిక వసతుల అభివృద్ధికి ఈసారి బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు జరిపే అవకాశముందని అనుకుంటున్నారు.
ఇంకా ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా ఉంటాయని అంచనా వేస్తున్నవిః
-కరోనా సెస్ విధింపు
-ఐటీ మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంపు
-పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
-మేడిన్ ఇండియాకు మరిన్ని ప్రోత్సహకాలు
-ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి రు.6వేల నుంచి రూ.10వేల పెంపు
-బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గింపు..