పౌరుసత్వం బిల్లు (సవరణ)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్,బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ల నుంచి భారతదేశానికి నుంచి వలస వచ్చిన ముస్లింయేతర శరణార్ధులకు దేశ పౌరసత్వం ఇచ్చే ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీజేపీ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ పౌరసత్వం బిల్లు (సవరణ) అన్నింటి కంటే ప్రధానమైన బిల్లు అని..జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 లాంటి రద్దు వంటి కీలకమైనదని అన్నారు.
సవరించిన పౌరసత్వం బిల్లు ప్రకారం ముస్లింయేతర మతాలైన హిందూ, క్రిస్టియన్, సిక్కు, జైన్, బుద్దిస్ట్, పార్శీ మతాల వారికి దేశం పౌరసత్వం కల్పిస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఈ మతస్థులకు మాత్రమే దేశ పౌరసత్వం కల్పించేందుకు ప్రస్తుతమున్న చట్టాల్లో మార్పులు చేశారు. ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎంపీలందరూ హాజరుకావాలని ఆ పార్టీ సూచిందింది.