భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ ఆశాజనకంగా ఉందని ఆమె పేర్కొన్నారు. చాలా దేశాల్లో ప్రస్తుతం ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయట్లేదనటం నిజం కాదని పేర్కొన్నారు. అటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులుంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వటమనేది కుదరదని నిర్మలా తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు వ్యగ్యంగా ఉన్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడికి దిగారు. కేంద్రం వసూలు చేసిన సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చామని ఆమె తెలిపారు. కేంద్రం వసూలు చేసే సెస్సులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయన్నారు.
బడ్జెట్ నుంచి మించి అప్పులు ఎక్కువ చేస్తే ఏ రాష్ట్రానికైనా నష్టమే అని ఆమె వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పుట్టబోయే బిడ్డ పై కూడా రూ.1.25 లక్షల అప్పు పడుతోందని ఆమె పేర్కొన్నారు.
చాలా దేశాల్లో ప్రస్తుతం ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉన్నాయన్నారు.
విపత్తుల నిధి నుంచి తెలంగాణకు 188 కోట్లు ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఇచ్చిన ప్రతి పైసాను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. పార్టీల ఉచితాలపై సమగ్ర చర్చలు జరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ ఆధారంగానే పథకాలు ఉండాలని పేర్కొన్నారు. అప్పులు తీర్చే రాబడిని చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలి అని ఆమె అన్నారు.