విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఎంత పెను విద్వంసాన్ని సృష్టించిందో తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత తెరుచుకుంటున్న పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కంపెనీ చిన్న ఏమరపాటు విశాఖ ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ పారిశ్రామిక వర్గాలకు కీలక సూచనలు చేసింది.
లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలను పున ప్రారంభించడానికి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. యూనిట్ ను తిరిగి ప్రారంభించేప్పుడు మొదటి వారాన్ని ట్రయల్ బేసిస్ లో నడపాలని, భద్రత, ప్రోటోకాల్ లను నిర్దారించుకున్న తర్వాతే అధిక ఉత్పత్తి లక్ష్యాలను చూసుకోవాలి కానీ కంపెనీ తెరవటంతోనే ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకోకూడదని సూచించింది. చిన్నపొరపాటు వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చేప్రమాదం ఉందని హెచ్చరించింది.
దేశంలో లాక్ డౌన్ సడలింపులు వస్తుండటంతో… క్రమ క్రమంగా ఆయా పరిశ్రమలు ఒక్కోక్కటిగా తెరుచుకుంటున్నాయి. దాదాపు 50 రోజులుగా పరిశ్రమలు మూతపడటంతో రసాయనాలతో ఉత్పత్తులు చేసే కంపెనీల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.