ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో పృథ్వీరాజ్ ఒకటి. అత్యంత ధైర్య పరాక్రమాలు కలిగిన వీరుడు, పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. మిస్ యూనివర్స్ మానూషి చిల్లర్ ఇందులో కథనాయికగా నటిస్తున్నారు.
సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూసూద్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చంద్రప్రకాశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను జూన్ 1న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చూస్తారని డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది తెలిపారు. అమిత్ షా కోసం ఢిల్లీలో స్పెషల్ ప్రీవ్యూ షోనూ ఏర్పాటు చేస్తు్న్నట్టు ఆయన తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న సినిమా విడుదల కానుండగా రెండు రోజుల ముందే అమిత్ షా కోసం స్పెషల్ షోను ఏర్పాటు చేశామని వివరించారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు సినిమాను చూస్తారని ఆయన వెల్లడించారు.