ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిందే నిజమని..ఎన్.ఆర్.సి ని దేశవ్యాప్తంగా అమలు చేయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్.ఆర్.సి కి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కు ఎలాంటి లింక్ లేదని కూడా అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ విషయంపై పార్లమెంట్ లో గాని..కేబినెట్ లో గాని ఇంకా ఎలాంటి చర్చ ఉండదని ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఎన్.ఆర్.సి పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్.ఆర్.సి ని తాము అమలు చేయమని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎన్.ఆర్.సి పై ప్రభుత్వం యు టర్న్ తీసుకుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి రెండు రోజుల క్రితమే ప్రకటించి తప్పును అమిత్ షా పైకి నెట్టారు. దీంతో అమిత్ దీనిపై స్పష్టత నిస్తూ ప్రధాని చెప్పిందే నిజమన్నారు.