చట్టంలో ఎక్కడ కూడా ”లవ్ జిహాద్” అనే పదాన్ని నిర్వచించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ”లవ్ జిహాద్” పై కేంద్ర ప్రభుత్వ సంస్థ లేవి కేసులు పెట్ట లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మాట్లాడే…తమకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ కల్పించిందని తెలిపారు. కేరళ హైకోర్టుతో సహా పలు కోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ” లవ్ జిహాద్” పై చట్టంలో ఎక్కడా లేదని లోక్ సభలో రాతపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ చెప్పారు. అయితే కేరళలో రెండు మతాంతర వివాహాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.