దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సత్వర న్యాయం జరిగిందని పోలీసులను కీర్తిస్తున్నాయి. కొంతైనా ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించే వార్త అంటూ పేర్కొంటున్నాయి.
నన్ను చంపండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా
అయితే, ఎన్‌కౌంటర్‌పై సీన్‌లోకి ఎంటరైంది కేంద్ర హోంశాఖ. ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, నిందితులను అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు అనే అంశాలపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. దేశంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యపై తెలంగాణ తరహాలో సత్వర న్యాయం చేయాలని, నిర్భయ విషయంలో ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారని ఢిల్లీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. యూపీ మాజీ సీఎం మాయవతి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
ఎన్‌కౌంటర్ ప్లేస్‌కు కుటుంబ సభ్యులు
ఈ నేపథ్యంలో… కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి నివేదిక కోరటం చర్చనీయాంశం అవుతోంది. పైగా శాంతిభద్రతలు అనేవి రాష్ట్ర పరిధిలోని అంశం కూడా. అయితే… దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్లు జరిగినా కేంద్ర హోంశాఖ నివేదిక తెప్పించుకుంటుందని, రోటీన్‌లో భాగమే ఇదీ కూడా అనే వాదన కూడా ఉంది.