దేశ రాజధాని నడిబొడ్డున రైతుల కవాతు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఓవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల నుండి శాంతియుతంగా రైతులను పంపించి వేస్తూనే… ఉదయం నుండి జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ, రైతులు ఎర్రకోట వైపు రావటం సహా అన్ని అంశాలపై చర్చిస్తున్నారు.
ఈ భేటీకి కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు సహా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.