వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని కేంద్రం దృవీకరించింది. రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారించగా… ఆయన తన జర్మన్ పౌరసత్వాన్ని 2023వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోంశాఖ కోర్టుకు మెమో రూపంలో తెలిపింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తే కేవలం మెమో రూపంలో ఇవ్వటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.