కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. అమిత్ షా మార్చి 12న రాష్ట్రానికి వస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆయన తన అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు వస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్పారు. ఆయన రాక నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేసే దిశగా బీజేపీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే విషయంపై బీజేపీ నేతలతో ఆయన చర్చిస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని పార్టీ నేతలు అనుకుంటున్నారు.