కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. మంత్రిగా తాను చేసే పనులకు చెందిన విషయాలను మాత్రమే కాక.. ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. ఇక కొన్నిసార్లు నెటిజన్లు చేసే కామెంట్లకు కూడా ఆమె స్పందిస్తూ హాస్య రసాన్ని పండిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూజర్ ఆమె చెప్పుల గురించి కామెంట్ చేయగా.. అందుకు ఆమె జోక్ చేస్తున్న రీతిలో స్పందించారు.
స్మృతి ఇరానీకి కరోనా సోకడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. అయితే ఆమె పనుల కోసం తరచూ ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె అధికారులు, ఇతర నాయకులతో ల్యాప్‌టాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ లకు హాజరు అవుతున్నారు. ఇక తాజాగా ఒక రోజు ఉదయాన్నే ఆమె ల్యాప్‌టాప్ ద్వారా మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే అందులో ఒక యూజర్ ఆమె ధరించిన చెప్పుల గురించి కామెంట్ చేయగా ఆమె స్పందించారు.
Advertisements
అవి హవాయి చెప్పులు కదా.. అని యూజర్ అడగ్గా.. అందుకు స్మతి ఇరానీ స్పందిస్తూ.. అవును.. అవి హవాయి చెప్పులే. ధర రూ.200 మాత్రమే. ఇక ఆ బ్రాండ్ గురించి నన్ను అడగకండి, అది లోకల్ బ్రాండే.. అని సమాధానం ఇచ్చారు. సాధారణంగా ఆమె లాంటి నేతలేకాదు, ఇతర సెలబ్రిటీలు ధరించే దుస్తులు, ఇతర యాక్ససరీలను నెటిజన్లు పరిశీలిస్తుంటారు. వాటి గురించి ఆరా తీస్తుంటారు. అవి ఏ బ్రాండ్‌కు చెందినవి అని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అందుకని ఆ తంటా అంతా ఎందుకు పడతారులే అని చెప్పి ఆమే స్వయంగా తాను ధరించిన చెప్పుల బ్రాండ్ గురించి చెప్పారు. కాగా ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.