సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న కేంద్ర సహయ మంత్రి మురళీధరన్ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటుంటే… కేసీఆర్ మాత్రం ఫ్యామిలీ వికాస్ అంటూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తుందన్న కేంద్రమంత్రి, కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచి చరిత్ర సృష్టించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
కమలాపురంలో బీజేపీ గౌడ గర్జన సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి మురళీధరన్ హజరయ్యారు.