కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ”చాలా మంది మిషినరీ స్కూల్ విద్యార్ధులు ఐఐటీ క్వాలిఫై అయి ఇంజనీర్లవుతారు..కానీ వాళ్లు విదేశాలకు వెళితే మాత్రం బీఫ్ తింటారు…వాళ్లకు మన సంస్కృతి, సంస్కారం తెలియదు” అన్నారు. బీహార్ లోని బేగుసరాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.”నేను భగవద్గీత లోని ఒక శ్లోకాన్ని చెబుతాను” ప్రతి స్కూళ్లో ఇది పిల్లలకు నేర్పించాలని మంత్రి కోరారు.
మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక సీనియర్ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.