ఏపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ఏపీలో ఇసుక సమస్య తాత్కాలికమైందన్నారు కేంద్ర హోంశాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి. విశాఖలో పర్యటిస్తున్న ఆయన హౌసింగ్ కోసం రాష్ట్రంలో 1500 ఎకరాల భూమి అవసరం ఉందని…దీనిపై ఏపీ సీఎంతో మాట్లాడుతానన్నారు. విశాఖ స్మార్ట్ సిటికి రావాల్సిన 100కోట్ల నిధుల విడుదలకు కృషి చేస్తానని, గ్రేటర్ విశాఖ సంస్థ తన పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు.
ఏపీ అభివృద్ధికి తనవంతు సహాయం అందించటంలో ఎప్పుడూ తోడుంటానని హామీ ఇచ్చారు కేంద్ర సహయమంత్రి కిషన్‌రెడ్డి.