బైంసా లో గత నెల జరిగిన అల్లర్ల లో నష్టపోయిన కొర్వగల్లీ బాధిత కుటుంబాలను కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లర్లలో నష్ట పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు అసలు కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. 10 లక్షల నష్టపరిహారం, పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ అల్లర్ల లో అమాయక ప్రజలు బాగా నస్తపోయారు,అక్రమంగా అరెస్ట్ చేసిన అమాయకులను యువకులను తక్షణమే విదుదల చెయ్యాలని కోరారు. అల్లర్ల పై సమగ్ర విచారణ చేపట్టి ,సి బి ఐ తో దర్యాప్తు జరిపించాలన్నారు. నష్ట పోయిన వారికి బీజేపీ అండగా ఉంటుందని ,రాష్ట్ర బీజేపీ నుండి 20 లక్షలు, బిజెపి ఎంపీ లు చెరో 5 లక్షలు, తన తరపున వచ్చే మూడు నెలల జీతం డబ్బులు అందజేస్తామని తెలిపారు.