భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భారతదేశ భూభాగాన్ని చైనాకు ఎవరు ఇచ్చారో రాహుల్ తన తాతను (జవహర్‌లాల్ నెహ్రూ)ను అడిగితే ఆయనకు సమాధానం వస్తుందని ఎద్దేవా చేశారు. ఎవరు దేశ భక్తులో, ఎవరు కాదో, ప్రజలకు తెలుసంటూ విమర్శించారు.
ఆంతకు ముందు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి చేరుకుంటుందని చెప్తున్నారని.. ఫింగర్ 4 ఇండియాదే అయినప్పటికీ ఫింగర్ 3కి ఎందుకు తరలివస్తున్నారని ప్రశ్నించారు. మోదీ సైన్యం త్యాగాలను అవమానిస్తున్నారని.. దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.