ఏపీలో తుగ్లక్ పాలన సాగుతుందని కేంద్రమంత్రి మురళీధరన్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంపైన ప్రమాణం చేసి ఒక మతాన్ని ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో సర్వమత సమ్మేళనం లేదన్న ఆయన.. ఒకే మతం కోసం ప్రచారం జరుగుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎందుకు నిరసన తెలుపుతున్నారో అర్ధం కావట్లేదని విమర్శించారు మురళీధరన్. ప్రధాని మోడీ మనియార్డర్ పంపితే జగన్ పోస్ట్ మాన్ లా పని చేస్తున్నారని సెటైర్లు వేశారు. పైగా తానే డబ్బులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని విషయాలు తొందరలోనే బయటపెడతామని హెచ్చరించారు కేంద్రమంత్రి.