ఖమ్మం సాయి గణేష్ వ్యవహారంపై బీజేపీ అగ్రనాయత్వం ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
సాయి గణేష్ కుటుంబాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్రమంత్రి. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు చంద్రశేఖర్. దీనిపై ఇంతవరకూ కేసు నమోదు కాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. కేంద్రమంత్రి వెంట రాకేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు.
ఇప్పటికే అమిత్ షా బాధిత కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆదేశాలతోనే చంద్రశేఖర్ వచ్చారు. ఇటు.. రాష్ట్ర నేతలు ఈ వ్యవహారంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శలు చేశారు.