పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.పౌరసత్వానికి సంబంధించిన ఏ చట్టమైనా పార్లమెంట్ చేయాల్సిందే కానీ రాష్ట్ర అసెంబ్లీ లు కాదని స్పష్టం చేశారు. సీఏఏ ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించిన కొన్ని గంటల్లోనే రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. పౌరసత్వ చట్టం భారతీయులకు సంబంధించినది కాదని…ఇది భారతీయులకు కొత్తగా పౌరసత్వం ఇవ్వదు…తొలగించదని చెప్పారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు ఉగాండా, శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన పని కరెక్ట్…అదే పని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా చేస్తే తప్పు అని అన్నారు రవిశంకర్ ప్రసాద్. ఇది ద్వంద వైఖరి. సీఏఏ రాజ్యాంబద్ధంగా…న్యాయబద్ధంగా ఉంది. కొంత మంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.