భారత్ లో జనవరి నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందా…? ఫేజ్-3 దశలో ఉన్న కరోనా వ్యాక్సిన్స్ కు కేంద్రం అత్యవసర అనుమతి ఇవ్వనుందా…? అంటే అవుననే ప్రచారం మొదలైంది.
జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ కోవాక్జిన్, ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ల పనితీరు, ఉత్పత్తి, రవాణా అంశాలపై ప్రధాని మోడీ ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం సంస్థ అత్యవసర వ్యాక్సినేషన్ కు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనుంది. మరో రెండు వారాల్లో ఇందుకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి అధికారికంగా దరఖాస్తు చేసుకోనుంది.
దీనిపై సీఐఐ సీఈవో ఆధార్ పునావాలా అధికారిక ప్రకటన చేశారు. ఈ దేశం వ్యక్తిగా ఈ దేశ ప్రజలకు ముందుగా వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత తమపై ఉందని ఇది వరకే ఆయన ప్రకటించారు. భారత ప్రభుత్వం ఎన్ని డోసులు అడుగుతుందో ఇప్పుడే చెప్పలేనప్పటికీ 2021 జులై నాటికి 30-40కోట్ల డోసులు సిద్ధం చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
దేశ, విదేశాల్లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-అస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే న్యూ ఇయర్ గిఫ్ట్ అందిందనే చెప్పుకోవచ్చు.