కేంద్ర రైల్వే మంత్రి
తిరువనంతపురం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డును మూసి వేయనున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ఏ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డునూ మూసివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ అనుకోవడం లేదని ఆయన వెల్లడించారు.
దేశంలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులను మూసి వేస్తారనే వార్త రాజ్యసభలో చర్చకు వచ్చింది. ప్రధానంగా తిరువనంత పురం రైల్వే బోర్డుకు సంబంధించి పలు వార్తలు వస్తున్నట్టు పలువురు సభ్యులు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని రైల్వే మంత్రిని పలువురు సభ్యులు కోరారు.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులను ఎందుకు మూసి వేయాలనుకుంటున్నారని రైల్వే మంత్రిని వారు ప్రశ్నించారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా అన్న విషయాలపై రైల్వే మంత్రి స్పందించాలని సభ్యులు కోరారు.
దీనిపై రైల్వే మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ ప్రస్తుతానికి రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవు. దానికి సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల నుంచిఎలాంటి ప్రతిపాదనలూ మాకు అందలేదు” తెలిపారు.