సినిమా ఇండస్ట్రీలో టేలెంట్ కి కొదవు లేదు. కాకపోతే ఎవరికైనా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రావాలంతే.. అది ఎప్పుడు ఎలా, ఏ సినిమా ద్వారా వస్తుందో ఎవరికీ తెలియదు. సినిమా విడుదలకు ముందు వేసుకున్న లెక్కలన్నీ ప్రేక్షకుడి కంట్లో పడగానే తారుమారు అవుతాయి. అది పాజిటీవ్ గానా నెగిటివ్ గానా అనేది వాళ్ళ వాళ్ళ అదృష్టం మీద డిపెండ్ అవుతుంది.
వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ హనీరోజ్ కి వచ్చిన క్రేజ్ ఇంచుమించు అలాంటిదే. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా సీనియర్ బాలకృష్ణకు హనీరోజ్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా కంటే ముందు హనీరోజ్ మలయాళం లో చాలా సినిమాలు చేసింది.అక్కడ వచ్చిన గుర్తింపు పరిధి తెలుగుతో పోలిస్తే చాలా చిన్నది. కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి లో నటించే అవకాశం కల్పించారు.
ఈ సినిమా తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం హనీరోజ్ తన అంద చందాల తో ప్రేక్షకులను మాయ చేయడమే. సినిమాలోనే కాకుండా సినిమా ఈవెంట్ లలో హనీ రోజ్ సందడి చేసింది.
దాంతో హనీరోజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో యమా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అసలు హనీ రోజ్ ఎవరు ఆమె బ్యాగ్ రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా హనీ కేరళలో క్యాథలిక్ కుటుంబం లో జన్మించింది.
హనీరోజ్ తండ్రి పేరు థామస్ కాగా తల్లి పేరు రోజ్…చిన్నవయసులోనే హనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ 2008 లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ రాజా హీరోగా నటించిన ఆలయం సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు.
అంతే కాకుండా మళ్లీ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో హానీ రోజ్ కు అవకాశాలు కూడా రాలేదు.
అయితే మలయాళం లో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తర్వాత హనీరోజ్ కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.అందుకే అంటారు కెరీర్ టర్న్ అవ్వడానికి ఒక్కఛాన్స్ చాలని.!