బాలయ్య… చెక్కుచెదరని అందం.మొక్కవోని ఆత్మవిశ్వాసం. మాటలో, బాటలోముక్కుసూటితనం. నిలువెత్తు మంచితనం. అందుకే ఇటు సినిమాల్లోను, అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదేరేంజ్ లో కొనసాగుతోంది.
ఆయన ఎదురుపడితే…మూమూలు వాళ్ళకే కాదు, ఫ్యాన్స్ కు కూడా కాస్త భయం పుడుతుంది. కానీ బాలయ్య సైతం భయపడే వ్యక్తి ఒకరు ఉన్నారు. నమ్మబుద్ధికావటం లేదు కదు. ఆ వ్యక్తి మరెవరో కాదు. ఆయన చిన్న కూతురు తేజశ్విని. సింహం లాంటి బాలయ్య ఈమెకు చాలా బయపడతారట.
బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మిణి నారా లోకేష్ సతీమణి అని హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటారని అందరికీ తెలుసు. కానీ బాలయ్య చిన్న కూతురు తేజశ్వి ఏం చేస్తుంటారు..? ఎక్కడ ఉంటారు ? అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
బాలయ్యను భయపట్టే ఒకే ఒక్క వ్యక్తి తేజస్విని…ప్రస్తుతం బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది ఆవిడే. ఇది వరకూ బాలయ్య సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రాంలు డాక్టర్ సురేందర్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు తేజశ్విని చూసుకుంటున్నారు.
అంతే కాకుండా బాలయ్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజశ్వినినే నిర్ణయిస్తారట.ఇదివరకూ బాలయ్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి ఆయన సతీమణి చూసుకునేవారు కానీ ఇప్పడు తేజశ్విని చూసుకుంటున్నారు.
ఇక తేజశ్విని గీతం యూనివర్సిటీ యజమాని మూర్తి మనవడు శ్రీభరత్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటూ బాలయ్య సినిమా వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.