ఇండియన్ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తు చేసిన భారీ చిత్రాల దర్శకులలో శంకర్ ఒకరు. భారతీయుడు, రోబో, అపరిచితుడు లాంటి సినిమాలతో శంకర్ రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఐ సినిమా తరవాత శంకర్ కు సరైన హిట్ లేదు. రోబో 2 కూడా నెటిగిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో చిరంజీవి కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమాలో చిరంజీవి నటించాల్సి ఉంది.
శంకర్ ఆ సినిమా కోసం చిరును సంప్రదించగా అప్పటికే వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం డేట్స్ లేకపోవడంతో చిరు రిజక్ట్ చేశారు.ఆ తరవాత శంకర్ అర్జున్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాడు.
అలా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ…శంకర్ తో సినిమా చేయమని రజినీకాంత్ చెప్పాడని అన్నారు.
శంకర్ సినిమా ఇప్పుడు చేద్దాం అంటే నేను రెడీ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం చరణ్ తో శంకర్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ గ్యాప్ లోనే శంకర్ చిరు కోసం కూడా ఓ కథను రాసుకుని ఒప్పిస్తే వారిద్దరి కాంబో సినిమా వచ్చినట్టే