శంకర్ ఒక సంచలన దర్శకుడు. వరుస హిట్లతో దక్షిణాది లోనే కాదు ఉత్తరాదిలో కూడా తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. 1993లో వచ్చిన ‘జెంటిల్ మ్యాన్’ సినిమాతో మొదలైన ప్రస్థానం భారీచిత్రాల స్థాయికి వెళ్ళింది.
జెంటిల్ మెన్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కుంజుమన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
ప్రభుదేవా ఈ చిత్రంలో చికుబుకు చికుబుకు రైలే ప్రత్యేక పాటలో తన స్టెప్పులతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. జెంటిల్ మ్యాన్ మూవీ నిర్మాత కుంజుమన్ కు కాసుల వర్షం కురిపించింది.
ఈ హిట్ తరువాత నిర్మాత కుంజుమన్ డైరెక్టర్ శంకర్ తో ఇంకో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శంకర్ ప్రేమికుడు మూవీ స్టోరిని నిర్మాతకి వినిపించారు.
ఈ సినిమాలో ప్రభుదేవా హీరో అని, ఈ చిత్రంలో గవర్నర్ కి బీదవారు అంటేనే అసహ్యించుకుంటారని చెప్పారు. అలాంటి గవర్నర్ కుమార్తెను పేదవాడైన హీరో ప్రేమిస్తాడు. నిర్మాత ఈ కథ నచ్చడం, ఆయన ఒప్పుకోవడంతో షూటింగ్ మొదలు పెట్టారు.
అయితే ఈ చిత్రంలో కుట్రలు కుతంత్రాలు చేసే గవర్నర్ పాత్ర ఉంటుందని, అదే ప్రేమికుడు మూవీ థీమ్ అనే సంగతి తమిళనాడు గవర్నర్ ఆఫీస్ వరకు వెళ్ళింది. అప్పుడు చెన్నారెడ్డి గవర్నర్ గా ఉండగా, సీఎం గా జయలలిత ఉన్నారు.
అయితే సినిమా విషయం తెలియగానే ప్రేమికుడు చిత్రాన్ని నిలిపవేయాలని, అందులో ఉండే గవర్నర్ కు చెందిన సీన్స్ ని తీసివేయాలని గవర్నర్ ఆఫీస్ నుండి ప్రొడ్యూసర్ కి వార్నింగ్ వచ్చిందట.ఇక అలా వార్నింగ్ రాగానే ఈ విషయాన్ని నిర్మాత కుంజుమన్ ముఖ్యమంత్రి జయలలిత వద్దకి తీసుకువెళ్లారట.
అప్పుడు జయలలిత మూవీలో ఎలాంటి వివాదాస్పద సీన్స్ లేకుండా తీసుకోమని అనుమతి ఇచ్చారు. సీఎం అనుమతి ఇవ్వడంతో ఆగిపోయిన ప్రేమికుడు మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేశారు. ప్రేమికుడు చిత్రాన్ని సీఎం జయలలిత చూసి మూవీ బాగుందని చెప్పారంట.
ఆ విధంగా గవర్నర్ అడ్డుకున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని 1994 లో సెప్టెంబర్ 17న విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా ఘన విజయాన్ని అందుకుంది. అది మాత్రమే కాకుండా 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 4 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఎన్నో గుర్తింపులను కూడా అందుకుంది.
Also Read: వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ విలన్లు… తర్వాత కితకితలు పెట్టే కమెడియన్లు…!