ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వారసుడిగా విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా కలియుగ పాండవులుతో మంచి హిట్ అందుకని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్ల ను అందుకుని స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే విక్టరీ వెంకటేష్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి పుత్రుడు సినిమా చేశాడు. 2001 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ అయింది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఎమ్ ఎస్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అంతకన్నా ముందు 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన కలిసుందాం..రా చిత్రం, అదే ఏడాది అక్టోబర్ లో వచ్చిన జయం మనదేరా సూపర్ హిట్ సాధించడంతో మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకటేష్.
మరోవైపు రమ్యకృష్ణ నటించిన ఆవిడే శ్యామల, దేవుళ్ళు వంటి చిత్రాలతో హిట్ ని అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు కోడి రామకృష్ణ. ఇలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలు మధ్య దేవి పుత్రుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫస్ట్ ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలకు ముందు మంచి విజయం సాధించాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పాటలు ఎక్కడా వినిపించలేదు. నిర్మాత ఎమ్ ఎస్ రాజు కూడా ఈ సినిమాకు డబ్బుని మంచినీరు ఖర్చుపెట్టినట్లు ఖర్చు పెట్టారట.
ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!
టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టారు. ఈ సినిమాలో ఇన్ని హైలెట్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించినంత ఫలితం తీసుకురలేకపోయింది. దానికి ప్రధాన కారణం కథనాన్ని ఆసక్తిగా నడిపించలేకపోవటమా… రాంగ్ టైంలో రిలీజ్ అవడం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు.
చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?
మరో వైపు ఈ సినిమాకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి మృగరాజు చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ అదే సమయంలో రిలీజ్ అయిన నందమూరి నటసింహం నరసింహనాయుడు చిత్రం మాత్రం రికార్డులను బ్రేక్ చేసేసింది. ఇక ఆ రోజుల్లో దేవి పుత్రుడు సినిమాకు 14 కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టారట. ఇప్పటి లెక్కల ప్రకారం 140 కోట్లు. ఈ సినిమా ఎంతో నష్టాలను ఎమ్ రాజు కు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. మనసంతా నువ్వే సినిమా 19ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ లేఖను విడుదల చేసిన ఆయన దేవి పుత్రుడు సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాని టీవీలో చూసి చాలా మంది అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.