హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని మలక్ పేట గంజ్ మార్కెట్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సదరు వ్యక్తి ఓ ట్రాలీ ఆటోలో ఉల్లి గడ్డలు విక్రయాలు చేస్తుండే వ్యక్తి అని స్థానికులు అనుమానిస్తున్నారు. వైన్స్ కు పక్కనే ఘటన చోటు చేసుకోవడంతో మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.