ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఓ వైపు సంబరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు మునిగితేలుతున్నారు. అదే సమయంలో అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మెహ్‌రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో పార్టీకి చెందిన ఓ కార్యకర్త మరణించగా మరో కార్యకర్త గాయపడినట్లు ఆప్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పుల జరపటం పట్ల ఆప్ తన అధికారక ట్విట్టర్ ద్వారా ఖండించింది.