పట్టపగలు.. నడిరోడ్డు మీద అధికారిని చంపడం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈమధ్య తెలంగాణ సహా సౌత్ రాష్ట్రాల్లో ఇలాంటి హత్యలు ఎక్కువయ్యాయి. అయితే నార్త్ సైడ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా ముంబైలో ఓ లాయర్ పై తల్వార్లు, ఇనుపరాడ్లతో దాడి చేశారు.
దాదాపు 15 మంది దుండగులు లాయర్ పై దాడికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. తీవ్ర గాయాల పాలైన అడ్వకేట్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.