విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడి సందర్శనానికి వైసీపీ,టీడీపీ,బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకోవటం తో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఆ తర్వాత ఆయన కొండపై నుంచి కిందకు వచ్చారు. తన వాహనం ఎక్కి తిరుగుపయనం అవుతున్న విజయసాయికి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని ఆపలేకపోయారు. కారుపై చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఒక రాయి తగలడంతో విజయసాయి కారు అద్దం పగిలింది. దీంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి, పోలీసుల సమకారంతో నడుచుకుంటూ ముందుకు వెళ్లి, వేరే కారులో బయల్దేరారు.