హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ యువతి, యువకుడు ఆమె ఇంట్లోకి వచ్చారు.
పనిమనిషి ఎవరని ఆరా తీస్తుండగానే కుక్క అరవడంతో వారు బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలసుకున్న డింపుల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు.
డింపుల్ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తుల్ని సాయిబాబు, శృతిగా పోలీసులు గుర్తించారు. తాము డింపుల్ అభిమానులమని.. ఆమెను కలవడానికే ఇంటికి వెళ్లినట్లు వారు పోలీసులకు వివరించారు. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదంలో డింపుల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే డీసీపీ కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరుపు లాయర్ ఆరోపించారు. హీరోయిన్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారని..దీంతో ఆమె బయటకు వెళ్లడానికే భయపడుతున్నారని చెప్పారు.