వైట్ హౌజ్ ఎదుట కాల్పులు కలకలం రేపాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు భవనం బయట కాల్పులకు తెగబడ్డారు. అధికారులు సమాచారం ఇవ్వడంతో.. ట్రంప్ మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు.
కాల్పుల శబ్దాలు విన్న సీక్రెట్ సర్వీసు పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని చుట్టుముట్టి షూట్ చేశారు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ట్రంప్ తిరిగి వచ్చి సమావేశాన్ని కొనసాగించారు. వైట్‌హౌజ్ బయట ఎవరినో షూట్ చేశారని మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాల్పుల సంగతి తెలిసి భయపడ్డారా అని జర్నలిస్టులు ట్రంప్‌ను అడగ్గా.. ఈ ప్రపంచం చాలా ప్రమాదకరమైన స్థలం.. అంత విశిష్టమైంది కాదంటూ ఆయన జవాబిచ్చారు. సీక్రెట్ సర్వీసు పోలీసులతో తాను సేఫ్‌గా ఉన్నానంటూ ట్రంప్ చెప్పారు.