హైదరాబాద్ పాతబస్తీలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దర్ని అడ్డుకుని నిలువు దోపిడీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
షాహీనగర్ నుండి మూడు వాహనాలపై వెంబడించి ఎర్రకుంట దగ్గర బాధితుల బైక్ ను అడ్డుకున్నారు దుండగులు. రెండు మొబైల్ ఫోన్లు, రూ.30వేల నగదు, పల్సర్ బైక్ లాక్కెళ్లిపోయారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మొత్తం ఆరుగురు కలిసి ఈ దారి దోపిడీ చేసినట్లు పోలీసులకు వివరించారు బాధితులు.