గత కొన్ని రోజులుగా ఏపీలో హిందూ దేవాలయాలకు సంబంధించి విగ్రహాల ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో మరో విగ్రహంను దుండగుల ధ్వంసం చేశారు. ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గర లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి ని దుండగులు విరగ్గొటారు.
దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయ్యి విరగగొట్టడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ తూ.గో.జిల్లా తెలుగు యువత ఉప అధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.