మంచు ఫ్యామిలీ ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త కామెడి అయినా ఒకప్పుడు మోహన్ బాబుకి ఆయన కుటుంబానికి మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో మోహన్ బాబు సినిమాలు అంటే ఫాన్స్ బాగా ఎదురు చూసేవారు అనే చెప్పాలి. ఆయన దాదాపుగా అన్ని పాత్రలు చేసారు. ఇక ఆయన కుమారుల విషయానికి వస్తే ఇద్దరూ సినిమా పరంగా ఇబ్బంది పడుతున్నారు. దర్శకులు కూడా పెద్దగా ముందుకి రావడం లేదు.
ఇదిలా ఉంచితే… మంచు విష్ణు ప్రేమించి వివాహం చేసుకున్న విరోనికా రెడ్డి గురించి చాలా మందికి తెలియదు. ఆమె కేవలం వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే అనుకుంటారు. కాని ఎవరికి తెలియని మరో కోణం ఆమె బిజినెస్ ఉమెన్. అమెరికాలోనే ఎక్కువ కాలం గడిపిన ఆమెకు అక్కడ వ్యాపారాలున్నాయి. అలాగే ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయని అంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆమె కొంత పెట్టుబడులు పెట్టారు.
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఆమెకు అమెరికాలో ఉంది. మంచు ఫ్యామిలీకి ఆమె ప్రధాన బలం అని అంటారు. వైఎస్ ఫ్యామిలీలో ఆమె చివరి మనవరాలు కాబట్టి అప్పట్లో అందరూ ఆమెను బాగా చూసుకునేవారు. సోషల్ మీడియాలో పెద్దగా కనపడరు ఆమె. ప్రస్తుతం మంచు విష్ణు సినిమాల మీద దృష్టి పెట్టారు. అయితే కొన్నాళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నారని సమాచారం.