యువ గళం పాదయాత్ర మొదటి రోజున నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో బెంగళూరులో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగైన తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
Also Read: తమ్ముడు తుపాకులతో ఆడుకునే వాడు…!: చిరంజీవి
తారకరత్న చాలా మందికి తెలుసు గాని ఆయన తండ్రి గురించి పెద్దగా జనాలకు పరిచయం లేదు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం కాగా, అందులో 8 మంది మగవారు కాగా నలుగురు అమ్మాయిలు. వారిలో 5వ కుమారుడే నందమూరి మోహన్ కృష్ణ. ఆయన పలు సినిమాలకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. తండ్రి ఎన్టీఆర్ తో పాటుగా తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు చాయాగ్రహకుడిగా కూడా సేవలు అందించారు.
1956లో హరికృష్ణ పుట్టిన రోజున జన్మించడం గమనార్హం. 1980లో ప్రముఖ నిర్మాత యు.విశ్వేశ్వరరావు కుమార్తెను వివాహం చేసుకోగా నందమూరి తారకరత్న.. నందమూరి రూప అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దానవీరశూరకర్ణకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా కన్నప్ప వద్ద పని చేసిన మోహన కృష్ణ… అనురాగ దేవత అనే సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.
Also Read: తెలుగు ‘బాషా’ బాలయ్యేనట…ఎలా మిస్సైందంటే..!?